అమ్మా..నేనొచ్చాను

medico parents dead in boat accident - Sakshi

కార్తీక మాస విహార యాత్ర పలు కుటుంబాల్లో విషాదాన్ని నిలిపింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఆదివారం బోటు బోల్తా పడింది. ఒంగోలు  యాత్రికులు కొందరు మృత్యువాత పడ్డారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. బంధువులు ఆస్పత్రులకు చేరుకుంటున్నారు.  

లబ్బీపేట(విజయవాడ తూర్పు): అమ్మ.. నేను విజయవాడ వస్తున్నా...’ అంతా బాగానే ఉంది అని ఫోన్‌ చేసిన గంటలోపే తల్లిదండ్రులు మృత్యువాత పడటం ఆ మెడికోను తీవ్రంగా కలిచివేసింది. గుంటూరు జిల్లా కాటూరి మెడికల్‌ కళాశాలలో హౌస్‌ సర్జన్‌ పవన్‌ తండ్రి కె.ఆంజనేయులు ఒంగోలులో బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్నాడు. భార్య వెంకటరమణతో కలిసి విహార యాత్రకు వచ్చారు. పవిత్రసంగమం వద్ద బోటు ప్రమాదంలో ఆంజనేయులుతో పాటు, వెంకట రమణ మృతి చెందింది.

ప్రమాదం విషయం తెలుసుకున్న పవన్‌ తన మిత్రులతో కలసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అక్కడ తన తండ్రి మృతదేహాన్ని చూసి కుప్పకూలాడు.  కొద్దిసేపటికే మరో పిడుగులాంటి వార్త తెలిసింది. తల్లి వెంకటరమణ కూడా మృతి చెందినట్లు పవన్‌మిత్రలకు తెలియడంతో ఆ విషయం అతడికి కొద్దిసేపటి వరకూ తెలియనివ్వలేదు. మా అమ్మ ఎక్కడా అంటూ విలపించడంతో విషయం చెప్పకతప్పలేదు.

Back to Top