నిర్వహణ లోపం వల్లే 'గెయిల్' పేలుడు | management error cause to gail pipeline burst | Sakshi
Sakshi News home page

నిర్వహణ లోపం వల్లే 'గెయిల్' పేలుడు

Jun 27 2014 3:01 PM | Updated on Sep 2 2017 9:27 AM

నిర్వహణ లోపం వల్లే 'గెయిల్' పేలుడు

నిర్వహణ లోపం వల్లే 'గెయిల్' పేలుడు

గెయిల్ పైపులైన్ పేలుడుకు గల కారణాలను ఆంధ్ర విశ్వివిద్యాలయం ప్రొఫెసర్ సీవీ రామన్ విశ్లేషించారు.

తూర్పు గోదావరి జిల్లా శుక్రవారం జరిగిన గెయిల్ పైపులైన్ పేలుడుకు గల కారణాలను ఆంధ్ర విశ్వివిద్యాలయం ప్రొఫెసర్ సీవీ రామన్ విశ్లేషించారు. పైపులైన్ల నిర్వహణ, ప్రమదాలు జరగడానికి గల కారణాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

డెల్టాలో చమురు తవ్వకాల వల్ల జరిగిన ప్రమాదం కాదు. ఇది కేవలం నిర్వహణలోపం వల్లే జరిగింది. పైపులైనును ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఈ తరహా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదసంకేతాలను ముందుగా గుర్తించకపోవడం వల్ల, సమన్వయ లోపం వల్ల ఇలా జరిగింది. గెయిల్ అధికారుల దగ్గర్నుంచి స్థానిక పంచాయతీ సర్పంచి వరకు అందరి మధ్య సమన్వయం ఉండాలి.

పైపులైన్ మీద ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటాయి. అందువల్ల ప్రతి మూడు నెలలకు ఒకసారి వీటిని సాంకేతిక నిపుణులు పరిశీలించాలి. ఐదు, పదేళ్లకోసారి మాత్రమే చూస్తే లోపాలు కూడా సరిగ్గా తెలియవు. పాతికేళ్ల నాటి పైపులు అంటే.. వాటి జాయింట్ల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement