కారులో లిఫ్ట్ ఇచ్చి దోచేశారు..! | Man robbed of Rs.1.70 lakhs and Gold | Sakshi
Sakshi News home page

కారులో లిఫ్ట్ ఇచ్చి దోచేశారు..!

Aug 23 2015 12:15 PM | Updated on Aug 30 2018 5:27 PM

లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ వ్యక్తిని కారు ఎక్కించుకొని అతని వద్ద ఉన్న రూ.1.70 లక్షలు, ఒక బంగారు ఉంగరాన్ని దోచుకున్నారు.

ఉంగుటూరు (పశ్చిమగోదావరి జిల్లా) :  లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఓ వ్యక్తిని కారు ఎక్కించుకొని అతని వద్ద ఉన్న రూ.1.70 లక్షలు, ఒక బంగారు ఉంగరాన్ని దోచుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం ఎల్లమిల్లు రేవు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన హరినారాయణ అనే వ్యక్తి డబ్బు ఉన్న సూట్కేసుతో రోడ్డుపై నిల్చున్నాడు.

కాగా ఇది గమనించిన కొంతమంది దుండగులు లిఫ్ట్ ఇస్తామని నమ్మబలికి కారు ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో అతని వద్ద నుంచి డబ్బు, బంగారాన్ని దోచుకుని అతన్ని వదిలేసి వెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement