టీ డబ్బులు అడిగితే నరికాడు | man killed with an ax to cut off in ysr district | Sakshi
Sakshi News home page

టీ డబ్బులు అడిగితే నరికాడు

Jan 29 2015 12:47 PM | Updated on Sep 2 2017 8:29 PM

టీ డబ్బులు అడిగితే నరికాడు

టీ డబ్బులు అడిగితే నరికాడు

వైఎస్సార్ జిల్లా కేంద్రంలోని అశోకా లాడ్జీ వద్ద దారుణం జరిగింది. టీ డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తి గొడ్డలితో టీ షాపు యాజమానిని నరికాడు.

కడప : టీ డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన వైఎస్ఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే  మోచంపేటకు చెందిన షేక్ రహీం(48) ఎస్‌ఎఫ్‌ఎస్ వీధిలో టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మోలా(25) అనే వ్యక్తి బుధవారం అక్కడకు వచ్చి టీ తాగాడు.

తీరా టీ కి డబ్బులు అడిగితే మోలా వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన మోలా ..టీ కొట్టు యజమానిపై గొడ్డలితో దాడి చేసి... గాయపరిచాడు.  తీవ్రంగా గాయపడిన రహీంను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు గురువారం మరణించారు.  కడప వన్ టౌన్ సీఐ కె.రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న మోలా కోసం గాలిస్తున్నారు.

(అర్బన్ క్రైం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement