నరాల వ్యాధితో నరకయాతన

Man Facing Problem With Nerve Disease in Chittoor - Sakshi

దాతల కోసం ఎదురుచూపు

మదనపల్లె టౌన్‌ : ఈ ఫొటోలో మంచానికే పరిమితమై వున్న వ్యక్తి పేరు సంకారపు శ్రీనివాసులు(51). వైఎస్‌ఆర్‌ జిల్లా చిన్నమండ్యం మండలం, దేవగుడిపల్లె పంచాయతి, కొండమూలపల్లె. బతుకుదెరువు కోసమని 32 ఏళ్లక్రితం ఊరుగాని ఊరు రొచ్చాడు. మదనపల్లె పట్టణం చంద్రాకాలనీ సమీపంలోని వైఎస్సార్‌ కాలనీలో ఉంటున్నారు. ఇతనికి భార్య శారద, ఒక కుమార్తె, కొడుకు ఉన్నారు. రాత్రింబవళ్లు భార్య ఒక చోట తనొకచోట కూలి మాగ్గాలు నేస్తూ శ్రమించారు. రంగురంగుల చీరలనేసి ప్రశంసలు అందుకున్నారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 2006లో పేదలకు ఇళ్లను మంజూరు చేయడంతో సొంతింటి కల నెరవేర్చుకున్నాడు. ఆ అన్యోన్య దంపతులను చూసి దేవుడు ఓర్వలేక పోయాడు.

తొమ్మిదేళ్ల క్రితం చీరలు నేస్తుండగా హైబీపీ రావడంతో కింద పడిపోయాడు. తిరుపతి, చెన్నై, బెంగుళూరు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. అయితేనరాల్లో కదలిక లేదని, ప్రతి రోజు ఫిజియోథెరపీ చేయిస్తే కొంతమేర మెరుగైన పరిస్థితి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటికే నెలకు మందులకు రూ.5 వేలపైనే ఖర్చు చేస్తుండడంతో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయన మంచానికే పరిమితమై కుటుంబాన్ని చూసి కుమిలిపోతున్నాడు. చదువుకోవాల్సిన 13 ఏళ్ల కొడుకు హోటల్లో ›పనిచేసే తెచ్చే కూలి డబ్బుతో బతుకు ఈడ్చుతూ దాతల చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు 63042 77828ను సంప్రదించాలని వేడుకుంటున్నారు. నీరుగట్టువారిపల్లె శాఖ ఆంధ్రాబ్యాంకు ఖాతా నంబర్‌: 209910100020445, ఐఎఫ్‌ఎస్‌సికోడ్‌ నెంబర్‌: ఏఎన్‌డిబీ 0002099.కు దాతలు జమ చేయవచ్చు.

ఆపరేషన్‌ చేస్తేమామూలు స్థితికి చేరుకోవచ్చు
కళ్లు తిరిగి కింద పడడంతో తలలో రక్త నాళాలు చిట్లి పక్షవాతం వచ్చింది. అంతేకాకుండా వెన్నెముక దెబ్బతినడం వల్ల కాళ్లు చేతులు పనిచేయకుండా పోయాయి. ఎమ్మార్‌ఐ స్కానింగ్‌ తీసి, వీలును బట్టి ఆపరేషన్‌ చేస్తే తిరిగి మామూలు స్థితికి చేరుకోవచ్చు. ఇది కాస్త ఖర్చుతో కూడిన వైద్యం.–డాక్టర్‌ సాయికిషోర్,మదనపల్లె జిల్లా ఆస్పత్రి వైద్యులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top