వడదెబ్బతో వ్యక్తి మృతి | man died with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Apr 6 2015 7:25 PM | Updated on Oct 9 2018 5:39 PM

శ్రీకాకుళం జిల్లాలో వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు..మెలియపుటి మండలం బగడా గ్రామానికి చెందిన గురివూరి గౌరేష్(52) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో టెక్కలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సోమవారం బయటకు వచ్చిన అతను వేడికి తట్టుకోలేక కూలబడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(టెక్కలి)

Advertisement
 
Advertisement
Advertisement