ప్రాణం తీసిన సరదా పందెం  | Man Died In Guntur District | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన సరదా పందెం 

Aug 2 2019 10:38 AM | Updated on Aug 2 2019 10:39 AM

Man Died In Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు(అచ్చంపేట) : ఇద్దరు స్నేహితులు  సరదాగా వేసుకున్న పందెం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న  ఘటన మండలంలోని రుద్రవరం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వణుగూరి వెంకటరెడ్డి (56), నల్లపాటి నాగేశ్వరరావు సరదాగా గ్రామం చివరలోని ఆర్‌ అండ్‌ బీ రోడ్డు పక్కన ఉన్న  యల్లమ్మకుంటలో ఒక వైపు నుంచి రెండో వైపునకు ఈదుకుంటూ వెళ్లాలని రూ.5 వేలు పందెం కాసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుంటలో వర్షపునీరు చేరి గతంలో కుంటలోతు పెరిగింది.  ఇద్దరు ఒకవైపు  నుంచి ఈత ప్రారంభించారు. నాగేశ్వరరావు రెండో వైపునకు చేరుకున్నారు. వెంకటరెడ్డి మరో నాలుగు అడుగుల దూరంలో ఉన్న గమ్యానికి చేరుకుంటాడనగా ఊపిరి ఆగిపోయి నీళ్లలో మునిగిపోయాడు.  కొద్దిసేపటికి గ్రామస్తులు వెంకటరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు.  మృతుడికి భార్య వెంకట్రావమ్మ, కుమార్తె ఉన్నారు. సరదాకా కాసుకున్న పందెం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. 

Advertisement
 
Advertisement
Advertisement