ప్రేముంచాడు..

Man Cheating After Love Marriage In Anantapur - Sakshi

 గుట్టుగా ప్రేమ వివాహం

తల్లిదండ్రుల ఒత్తిడితో అబ్బాయి ఉడాయింపు

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నీవే ప్రాణమన్నాడు. నీవు లేకుండా బతకలేనన్నాడు. పెళ్లి చేసుకుంటానని ఒప్పించాడు. జీవితాంతం తోడుంటానని నమ్మించాడు. ఇంకేముంది..నిజమేనని ఆ అమ్మాయి నమ్మింది. సరేనని తలూపింది. ఇద్దరూ ఒకరికొకరం అనుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ముద్దూ ముచ్చట తీర్చుకున్నారు..అమ్మాయి గర్భిణి అయ్యింది. అంతలోనే అబ్బాయి తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ప్రేమపెళ్లి చెల్లదన్నారు. అతనిపై ఒత్తిడి తెచ్చారు. భార్యకు చెప్పకుండా అబ్బాయి అదృశ్యమయ్యాడు. నెలలు నిండిన అమ్మాయి మంగళవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.     తోడెవ్వరు లేరు..పలకరించేవారులేరు.   

అనంతపురం సెంట్రల్‌ : ప్రేమ పెళ్లి చేసుకుని.. అమ్మాయి గర్భం దాల్చాక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఒత్తిడి భరించలేక అబ్బాయి పరారయ్యాడు. అమ్మాయి నెలలు నిండి పండంటి ఆడబిడ్డకు జన్మని     చ్చింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బొమ్మనహాళ్‌ మండలానికి చెందిన అమ్మాయి (21) బీఎస్సీ నర్సింగ్‌ చదువుతోంది. కళ్యాణదుర్గం మండలానికి చెందిన అబ్బాయి అనంతపురం ఆర్ట్స్‌కళాశాలలో చదివే సమయంలో అమ్మాయి సోదరుడితో స్నేహం ఏర్పడింది. అలా రాకపోకలు సాగిపోతున్న తరుణంలో స్నేహితుడి సోదరిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఏడాదిన్నరపాటు ఇంట్లో వారికి తెలియకుండా కాపురం చేశాడు.

ఇక్కడే ఉంటే ఎవరికైనా తెలుస్తుందని చివరకు మకాం హైదరాబాద్‌కు మార్చాడు. ఆలస్యంగా కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో తీవ్రంగా మందలించారు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో అబ్బాయి సదరు అమ్మాయిని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటికే ఆ అమ్మాయి గర్భిణి కావడంతో విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే వెళ్లి కుమార్తెను పుట్టింటికి తీసుకొచ్చారు. సోమవారం పురిటినొప్పులు రావడంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అమ్మాయి మైనరేమోనని అనుమానంతో వైద్యులు ఆరా తీశారు. అనంతరం టూటౌన్‌ సీఐ ఆరోహణరావు కూడా అమ్మాయి నుంచి వివరాలు సేకరించారు. ఆమె మేజర్‌ కావడం, ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి కేసూ నమోదు చేయలేదని సీఐ తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top