డబ్బు ఇమ్మన్నందుకు కత్తితో పొడిచాడు.. | man attacks woman by knife | Sakshi
Sakshi News home page

డబ్బు ఇమ్మన్నందుకు కత్తితో పొడిచాడు..

Apr 21 2015 4:11 PM | Updated on Jun 1 2018 8:36 PM

మంగళవారం ఉదయం ఓ మహిళపై ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేశాడు.

అనంతపురం : మంగళవారం ఉదయం ఓ మహిళపై ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా  కమలానగర్‌కు చెందిన మోమిన్‌బేగం అనే మహిళ చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. కాగా స్థానికంగా ఆటో నడుపుకునే వెంకటకృష్ణ అనే వ్యక్తి గతంలో ఆమె వద్ద  రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు.

 

ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని మోమిన్‌బేగం అడుగుతుండగా కొంతకాలంగా అతను వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అతన్ని గట్టిగా నిలదీయగా ఆమెను కత్తితో పొడిచాడు. ఆమె కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి రాగా నిందితుడు పారిపోయాడు. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement