జోయాలుక్కాస్‌లో మహారాణి నెక్లెస్ | Maharani Necklace displayed in Joyalukkas showroom | Sakshi
Sakshi News home page

జోయాలుక్కాస్‌లో మహారాణి నెక్లెస్

Dec 13 2013 10:27 AM | Updated on Sep 2 2017 1:32 AM

జోయాలుక్కాస్‌లో మహారాణి నెక్లెస్

జోయాలుక్కాస్‌లో మహారాణి నెక్లెస్

మూడున్నర కేజీల 22 క్యారట్ల 916 గోల్డ్‌తో రాష్ట్రంలోనే మొదటిసారిగా తయారుచేసిన అతిపెద్ద నెక్లెస్‌లను విజయవాడ నగరంలోని జోయాలుక్కాస్ షో రూమ్‌లో అందుబాటులో ఉంచారు.

నెక్లెస్ అంటే.. సాధారణంగా మెడలో ఆరు నుంచి తొమ్మిది అంగుళాల వరకు పొడవుతో వేసుకుంటారు. అదే లాంగ్ చైన్ అయితే మరికొంత పొడవు ఉంటుంది. అది 12 నుంచి 15 అంగుళాల వరకు పొడవుంటుంది. అదే రాణులు, మహారాణులు ధరించే నెక్లెస్లు అయితే ఎంత పొడవుండాలి? ఇంకెంత బరువుండాలి? సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో ప్రముఖ నగల దుకాణం జోయాలుక్కాస్ వాళ్లు ఓ భారీ నెక్లెస్ను రూపొందించారు. దీని బరువు.. అక్షరాలా మూడున్నర కిలోలు!! 22 క్యారట్ల 916 గోల్డ్తో రూపొందించిన ఈ నెక్లెస్ను రాష్ట్రంలో తొలిసారిగా ప్రదర్శించారు.

దీన్ని 180 రోజుల పాటు శ్రమించి కేరళలో రూపొందించినట్లు షోరూం ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా తెలిపారు. చెన్నైలోని జోయాలుక్కాస్ షోరూమ్‌లో మూడు మహారాణి నెక్లెస్‌లను విక్రయించినట్లు  ఆయన చెప్పారు. ఇంతకీ మన రాష్ట్రంలో ఇంత పెద్ద నెక్లెస్ను తొలిసారిగా ధరించే భాగ్యం ఎవరికి దక్కిందా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. విజయవాడ నగరంలోని జోయాలుక్కాస్ షో రూమ్‌లో ఈ నెక్లెస్ అందుబాటులో ఉంది. 2009లో మిస్ విజయవాడగా ఎంపికైన కూచిపూడి నృత్య కళాకారిణి వీణ ఎంజీ రోడ్డులోని షోరూమ్‌లో ఈ నెక్లెస్‌ను ధరించి, లాంఛనంగా ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement