కాంగ్రెస్కు మోడీ అంటే .... | M.Venkaiah naidu takes on congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్కు మోడీ అంటే ....

Jan 23 2014 1:12 PM | Updated on Mar 18 2019 7:55 PM

ఎం. వెంకయ్యనాయుడు - Sakshi

ఎం. వెంకయ్యనాయుడు

గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పేరు వింటేనే కాంగ్రెస్ పార్టీ వణుకుతోందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పేరు వింటేనే కాంగ్రెస్ పార్టీ వణుకుతోందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. అందుకే మోడీ పేరు వినగానే ఆ పార్టీ అదుపు (బ్యాలెన్స్) కోల్పోయి మాట్లాడుతుందని అన్నారు.  గురువారం హైదరాబాద్లో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... గతంలో వాజ్పాయ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా దేశంలో ధరలు అదుపులో ఉండేవని, అలాగే రైతులు, మహిళలు సంతోషంగా ఉండేవారని ఆయన గుర్తు చేశారు.

 

అయితే యూపీఏ పాలనలో అందుకు విరుద్ధంగా జరుగుతుందని తెలిపారు. తమ పార్టీ అధికారంలో ఉండగా దేశ అర్థికాభివృద్ధి 8.4 శాతానికి తీసుకువచ్చిందని, ఆ తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన యూపీఏ ఆ శాతాన్ని 4.4 తీసుకువచ్చిందని ఆరోపించారు. 2004లో దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని గతంలో కేంద్ర మంత్రి పి. చిదంబరం ప్రశంసించారని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. దేశ అర్థిక వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని చిదంబరం విమర్శించడం ఎంతవరకు సమంజసం అని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా చిదంబరాన్ని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement