'అనంత'కు సడలింపు

Lockdown Relaxation in Anantapur - Sakshi

కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ అమలు

నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో వెసులుబాటు

రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకూ కర్ఫ్యూ

దుకాణాలు తెరిచేందుకు మరో రెండు రోజులు

నిబంధనలు పాటించకపోతే చర్యలు

కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు

అనంతపురం అర్బన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో నాల్గో విడత లాక్‌డౌన్‌ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎïస్పీ సత్యయేసుబాబు స్పష్టం చేశారు. జిల్లాలో నిర్దేశించిన కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ యథావిధిగా అమలు అవుతుందన్నారు. నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వెసులబాట్లు ఉంటాయన్నారు. అయితే రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. అత్యవసరాలకు మినహాయింపునిస్తామన్నారు. బుధవారం ఆయన లాక్‌డౌన్‌ అమలు తీరును కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో విలేకరులకు వివరించారు. లాక్‌డౌన్‌లో వెసులబాట్లు కల్పిచడం అంటే కరోనా పోయినట్లు కాదనీ, ప్రతి ఒక్కరూ కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

కంటైన్‌మెంట్‌ జోన్లు ఇలా..
జిల్లావ్యాప్తంగా 12 కంటైన్‌మెంట్‌ జోన్లు ప్రకటించమనీ, వీటి పరిధిలో 41 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు. నెలలో పది పాజిటివ్‌ కేసులు నమోదై ఉండి, ఐదు రోజుల్లో ఒక పాజిటివ్‌ కేసు నమోదైన ప్రాంతంలో 500 మీటర్లు కోర్‌ ఏరియా, 500 మీటర్లు బఫర్‌ ఏరియా ఉంటుందన్నారు. ఐదు రోజులుగా ఒక కేసు నమోదు కాకపోతే ఆ ప్రాంతంలో 200 మీటర్లు కోర్‌ ఏరియా, 200 మీటర్లు బఫర్‌ ఏరియా ఉంటుందన్నారు. 14 రోజులుగా కేసు నమోదు కాకపోతే కేవలం 200 మీటర్లు కోర్‌ ఏరియా మాత్రమే ఉంటుందన్నారు. 

‘పురం’ పూర్తిగా కంటైన్‌మెంట్‌ జోన్‌
హిందూపురం పట్టణాన్ని పూర్తిగా కంటైన్‌మెంట్‌ జోన్‌గా గుర్తించామని కలెక్టర్‌ చంద్రుడువెల్లడించారు. హిందూపురం రూరల్‌లో ఒక ప్రాంతం, అనంతపురం అర్బన్‌లో 8 ప్రాంతాలు, అనంతపురం రూరల్‌లో ఒక కంటైన్‌మెంట్‌ జోన్‌ ఉంటుందన్నారు. ఇలా మొత్తం 12 జోన్‌ల పరిధిలో 41 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు ఉంటాయన్నారు. వీటి పరిధిలో 40 వేల కుటుంబాలు, 2.15 లక్షల జనాభా ఉంటుందన్నారు. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ యథావిధిగా అమలు అవుతుందన్నారు. 

దుకాణాలు తెరిచేందుకు రెండు రోజుల్లో నిర్ణయం
నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌న్లుగా ఉన్న అర్బన్‌ ప్రాంతాల్లో దుకాణాలు తెరిచేందుకు రెండు లేదా మూడు రోజులు సమయం పడుతుందన్నారు. అన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా తెరుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా పట్టణాల్లో వ్యాపారులతో మున్సిపల్‌ అధికారులు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేస్తారన్నారు. దుకాణాలు ఒకరోజు ఒకవైపున తెరిస్తే మరుసటి రోజు రెండవ వైపున దుకాణాలు తెరిచేలా చూస్తామన్నారు. 

రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీగా రవీంద్రనాథ్‌
అనంతపురం టౌన్‌: రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌గా రవీంద్రనాథ్‌ను నియమిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నాళ్లూ వైఎస్సార్‌ కడప జిల్లా డీఐజీగా ఉన్న గిరిబాబుకు అనంతపురం జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో బుధవారం రవీంద్రనాథ్‌కు రెగ్యులర్‌ డీఐజీగా బాధ్యతలు అప్పగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top