తమపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
తమపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మండలంలోని రాఘవాపురం పంచాయతీ పరిధిలో వీధిలైట్లను వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు సొంత డబ్బుతో వేయించారు. తనకు సమాచారం ఇవ్వకుండా లైట్లు ఏర్పాటు చేశారని.. సర్పంచ్.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఈ కేసులు ఎత్తి వేయాలని కోరుతూ కార్యకర్తలు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.