
ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో వారు ద్విచక్ర వాహనదారులను రెండు గంటల పాటు అటువైపు వెళ్లకుండా నిలిపివేశారు.
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైల దేవస్థానానికి 14 కిలోమీటర్ల దూరంలోని చిన్నారుట్ల వద్ద ఘాట్‌లో చిరుతపులి రోడ్డుపైకి వచ్చింది. సోమవారం ఉదయం ఆరు గంటలకు అటవీ మార్గంలో వాహనాలు వెళ్లేందుకు అటవీశాఖ అధికారులు చెక్‌పోస్టులను తెరిచారు. శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వాహనాల్లో వెళ్తున్న ప్రయాణికులకు ఎదురుగా చిరుత కనిపించింది. కాసేపటికి చిరుత రోడ్డు దాటుకుని అడవిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో వారు ద్విచక్ర వాహనదారులను రెండు గంటల పాటు అటువైపు వెళ్లకుండా నిలిపివేశారు.