విశాఖలో ఘోర విషాదం..! | At Least Four People Died Due To Drinking Toxic In Vizag | Sakshi
Sakshi News home page

విశాఖలో ఘోర విషాదం..!

Feb 24 2019 5:25 PM | Updated on Feb 25 2019 7:46 AM

At Least Four People Died Due To Drinking Toxic In Vizag - Sakshi

విశాఖపట్నం : జిల్లాలో  పెనువిషాదం చోటుచేసుకుంది. ఓ డబ్బాలోని గుర్తు తెలియని ద్రావణాన్ని మద్యంగా భావించిన కొందరు వ్యక్తులు దానిని సేవించారు. అది విషతుల్యమైనది కావడంతో ముగ్గురు ప్రాణాలు విడిచారు. మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న బాధితులను కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటన గురించి జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌ మీడియాతో మాట్లాడారు. బాధితులు తాగిన ద్రావణం ఏమిటో తెలియడం లేదని, దాంతో చికిత్సకు విఘాతం కలుగుతోందని అన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించామని తెలిపారు. ఘటనపై ఎక్సైజ్‌, పోలీస్ అధికారుల దర్యాప్తునకు ఆదేశించామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement