కర్నూలు కమిషనర్‌గా అభిషిక్తు కిషోర్‌  | Kurnool Municipal Corporation New Commissioner Abhishikth Kishore | Sakshi
Sakshi News home page

కర్నూలు కమిషనర్‌గా అభిషిక్తు కిషోర్‌ 

Aug 3 2019 7:56 AM | Updated on Aug 3 2019 7:56 AM

Kurnool Municipal Corporation New Commissioner Abhishikth Kishore - Sakshi

సాక్షి, కర్నూలు  : నగర పాలక సంస్థ కమిషనర్‌గా మళ్లీ ఐఏఎస్‌ అధికారి నియమితులయ్యారు. ముట్టింబాకు అభిషిక్తు కిషోర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం శుక్రవారం సాయంత్రం జీవో 1760 జారీ చేశారు.  ప్రస్తుతం ఈయన తూర్పు గోదావరి జిల్లా చింతూరులో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. కాగా.. గత నెల 14న కర్నూలు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎస్‌. రవీంద్రబాబు 20 రోజుల వ్యవధిలోనే బదిలీ కావడం గమనార్హం. నగర పాలక సంస్థలకు కమిషనర్లుగా ఐఏఎస్‌లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగానే  అభిషిక్తు కిషోర్‌ను ఇక్కడ నియమించింది. రవీంద్ర బాబు కన్నా ముందు ఐఏఎస్‌ అధికారి ప్రశాంతి ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన విషయం విదితమే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement