కృష్ణా జలాల వివాదం కేసు ఏప్రిల్ 29కి వాయిదా | krishna water dispute is postponed to april 29 | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాల వివాదం కేసు ఏప్రిల్ 29కి వాయిదా

Mar 27 2015 11:46 AM | Updated on Sep 2 2018 5:18 PM

కృష్ణా జలాల వివాదం కేసు ఏప్రిల్ 29కి వాయిదా - Sakshi

కృష్ణా జలాల వివాదం కేసు ఏప్రిల్ 29కి వాయిదా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్య కొంతకాలంగా నలుగుతున్న కృష్ణా జలాల వివాదం కేసును ఏప్రిల్ 29 వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్య కొంతకాలంగా నలుగుతున్న కృష్ణా జలాల వివాదం కేసును  ఏప్రిల్ 29 వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతే కాకుండా జలవివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించొద్దని కోర్టు ఈ సందర్భంగా మూడు రాష్ట్రాలకూ హితవు పలికింది. ఎక్కువ వాయిదాలు కోరకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని  సూచించింది. అయితే గెజిట్ లో తమ  వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా కోరుతూ వస్తున్న విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement