నెల్లూరు ఆతిథ్యం చాలా బాగుంది | krishna gadi veera prema gadha celebrating nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరు ఆతిథ్యం చాలా బాగుంది

Feb 19 2016 2:59 AM | Updated on Sep 3 2017 5:54 PM

నెల్లూరు ఆతిథ్యం చాలా బాగుంది

నెల్లూరు ఆతిథ్యం చాలా బాగుంది

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా విజయోత్సవ యాత్ర.....

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ హీరో నాని
ఎస్2 థియేటర్‌లో చిత్ర యూనిట్ సందడి

  
నెల్లూరు, సిటీ :  నెల్లూరు ఆహారం, ఆతిథ్యం చాలా బాగుందని సినీ హీరో నాని అన్నారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా విజయోత్సవ యాత్రను పురస్కరించుకొని చిత్ర బృం దం గురువారం నెల్లూరు నగరంలోని ఎస్2 థియేటర్‌లో సందడి చేసింది. ఈ సందర్భం గా నాని మాట్లాడుతూ మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువైందన్నారు. సినిమాకు ఇంతటి విజ యం అందించిన ప్రేక్షకులను నేరుగా కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకే యాత్రను ప్రారంభించామన్నారు. హైదరాబాద్‌లో కంటే నెల్లూరులోనే థియేటర్లు బాగుయన్నారు. బుధవారం నుంచే నెల్లూరులో ఉన్నానని, ఇక్కటి వంటకాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రేమగాథ విజయం ఇచ్చిన ఎనర్జీతో కొత్త సినిమాలో మరింత ఉత్సాహంగా పనిచేస్తానన్నారు. ఈ సందర్భంగా నాని సినిమాలోని ఓ డైలాగ్ చెప్పడంతో ప్రేక్షకులు విజిల్స్‌తో కేరింతలు కొట్టారు. చిత్ర నిర్మాత గోపి, డెరైక్టర్ హను రాఘవపూడి, హీరోయిన్ మెహరన్, నటులు శ్రీనివాసులు, హుస్సేన్, డిస్ట్రిబ్యూటర్ హరి, థియేటర్ మేనేజర్లు ఆదిత్యబాబు, లీలాప్రసాద్‌లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement