'కమీషన్ల కోసమే బాబు జిల్లాకు వస్తున్నారు' | Kothapalli subbarayudu takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'కమీషన్ల కోసమే బాబు జిల్లాకు వస్తున్నారు'

May 14 2015 9:42 AM | Updated on Aug 21 2018 8:34 PM

'కమీషన్ల కోసమే బాబు జిల్లాకు వస్తున్నారు' - Sakshi

'కమీషన్ల కోసమే బాబు జిల్లాకు వస్తున్నారు'

పోలవరం ప్రాజెక్ట్కు నిధులు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆరోపించారు.

ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్కు నిధులు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆరోపించారు. గురువారం ఏలూరులో కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ... పనులు జరగని పోలవరం ప్రాజెక్ట్పై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కమిషన్లు దండుకోవడానికే చంద్రబాబు పదేపదే జిల్లాకు వస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఈ ఏడాది కాలంలో ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని చంద్రబాబును ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.చంద్రబాబు నాయుడు నేడు, రేపు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. అలాగే రేపు పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు.  ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై కొత్తపల్లి సుబ్బారాయుడు నిప్పులు చెరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement