కొల్లేరు పక్షుల అందాలు భేష్‌: నీలం సాహ్ని

Kolleru Birds Are So Beauty Full Says Neelam Sahni - Sakshi

ఆటపాక(కైకలూరు): కొల్లేరు పక్షుల కేరింతలు ఎంతగానో ఆకట్టుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కితాబిచ్చారు. కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని ఆదివారం కుటుంబసభ్యులతో కలసి ఆమె సందర్శించారు. బోటు షికారు చేస్తూ పెలికాన్, పెయింటెడ్‌ స్ట్రాక్‌ పక్షుల అందాలను తిలకించారు. అనంతరం పక్షినమూనా కేంద్రాన్ని సందర్శించారు. కొల్లేరు నైసర్గిక స్వరూపం, పక్షుల జీవిత విశేషాలు, వాతావరణ పరిస్థితులు, ప్రజల జీవన విధానాన్ని సీఎస్‌కు అటవీశాఖ రేంజర్‌ బి.విజయ వివరించారు. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు రద్దు చేయడంపై మీడియా ప్రశి్నంచగా.. ఆ విషయమై అటవీ శాఖ పీసీసీఎఫ్‌ వైల్డ్‌లైఫ్‌ అధికారితో మాట్లాడానని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top