26న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  | koilalwar tirumanjanam in tirumala temple | Sakshi
Sakshi News home page

​శ్రీవారి ఆలయంలో 26న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం 

Dec 20 2017 8:28 AM | Updated on Aug 13 2018 3:11 PM

సాక్షి, తిరుమల:  తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 26వ తేది మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.  ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమలమంజనంలో భాగంగా  ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం. ఈనెల 26వ తేది వైకుంఠ ఏకాదశిసందర‍్భంగా ఈ వైదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారంæ ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తారు. అర్చకులు ఆగమోక్తంగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆలయ మహద్వారం మొదలు గర్భాలయంవరకు, ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని సంప్రదాయంగా శుద్ధి చేస్తారు.  సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలు  నిర్వహిస్తారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. 

29న వైకుంఠ ఏకాదశి పూజలు
ఈనెల 29వ తేది వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో ›ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆరోజు అర్థరాత్రి 12.01  నుండి 5 గంటలవరకు ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. తిరుప్పావైతో మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, అభిసేకం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిస్తారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీవారి స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు దర్శనమివ్వనున్నారు. 

30న తీర్థ ముక్కోటి.. పుష్కరిణిలో చక్రస్నానం
ఈనెల 30వ తేదిన వైకుంఠ ద్వాదశి సందర్భంగా  తీర్థ ముక్కోటి ఉత్సవం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 4.30 నుండి 5.30 గంటల మధ్య సుదర్శన చక్రత్తాళ్వారు పుష్కరిణి వద్ద అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించి, చక్రస్నానం చేస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement