చంద్రబాబు-2 పాలన అందిస్తున్న కిరణ్ | kiran kumar reddy steps into shoes of chandrababu naidu: Janak Prasad | Sakshi
Sakshi News home page

చంద్రబాబు-2 పాలన అందిస్తున్న కిరణ్

Nov 5 2013 6:09 PM | Updated on Sep 4 2018 5:07 PM

చంద్రబాబు-2 పాలన అందిస్తున్న కిరణ్ - Sakshi

చంద్రబాబు-2 పాలన అందిస్తున్న కిరణ్

చంద్రబాబు-2 పాలనను కిరణ్‌ ప్రజలకు అందిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు జనక్ ప్రసాద్ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంచడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సామాన్యుడిపై భారం మోపేలా చార్జీలు పెంచడం దారుణమని పేర్కొంది. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కిరణ్‌ సర్కార్‌కు అంతిమ ఘడియలు సమీపించాయని వైఎస్సార్ సీపీ నాయకుడు జనక్ ప్రసాద్ ధ్వజమెత్తారు. కిరణ్‌ హయాంలో నాలుగు సార్లు ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని తెలిపారు. రోశయ్య హయాంలో ఒకసారి వడ్డించారని ఆయన వెల్లడించారు.
 

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు పెంచకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అడుగుజాడల్లో కిరణ్ నడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు-2 పాలనను ప్రజలకు కిరణ్ కుమార్ రెడ్డి అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని జనక్ ప్రసాద్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement