ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రజలను నిలువునా ముంచారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రజలను నిలువునా ముంచారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లాస్ట్ బాల్ అంటూ ప్రజలను ఆయన మభ్యపెట్టారని వీహెచ్ సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. కిరణ్ బెస్ట్ బ్యాట్మెన్ అని అయితే లాస్ట్ బౌలర్గా మిగిలి పోతారని అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టినా అది నిలబడదని ఆయన జోస్యం చెప్పారు. కిరణ్ కొత్తపార్టీలోకి ఎవరూ వెళ్లరని అన్నారు. సొంత జిల్లా చిత్తూరు నుంచి ఒక్క నేత కూడా సీఎం వెంట లేకపోవడమే కొత్త పార్టీ నిలబడదనడానికి నిదర్శనమని వీహెచ్ చెప్పుకొచ్చారు.