'దేశానికే కాదు... కుటుంబానికి ఏమీ చేయలేదు' | Kavuri Sambasiva Rao takes on Sonia Gandhi | Sakshi
Sakshi News home page

'దేశానికే కాదు... కుటుంబానికి ఏమీ చేయలేదు'

Jul 19 2014 2:00 PM | Updated on Mar 29 2019 9:24 PM

'దేశానికే కాదు... కుటుంబానికి ఏమీ చేయలేదు' - Sakshi

'దేశానికే కాదు... కుటుంబానికి ఏమీ చేయలేదు'

తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆరోపించారు.

తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కావూరి సాంబశివరావు ఆరోపించారు. శనివారం కర్నూలులో జరిగిన బీజేపీ పార్టీ సమావేశాలకు కావూరి సాంబశివరావు హాజరైయ్యారు. కావూరి సాంబశివరావు ఈ సందర్భంగా కాంగ్రెస్ సోనియాగాంధీపై నిప్పులు చెరిగారు.

 

దేశానికే కాదు సొంత కుటుంబానికి కూడా ఏమీ చేసుకోలేక పోయారని కావూరి... సోనియాగాంధీని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి మంచి గుణపాఠం చెప్పారని అన్నారు.  ఆ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబుతోపాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరైయ్యారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement