‘బ్యాంకుల్లో డబ్బున్నా తీసుకోలేని పరిస్థితి’ | kannababu slams Andhra pradesh CM chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘బ్యాంకుల్లో డబ్బున్నా తీసుకోలేని పరిస్థితి’

Dec 28 2016 2:31 PM | Updated on Oct 1 2018 2:09 PM

‘బ్యాంకుల్లో డబ్బున్నా తీసుకోలేని పరిస్థితి’ - Sakshi

‘బ్యాంకుల్లో డబ్బున్నా తీసుకోలేని పరిస్థితి’

నగదు కష్టాలకు ప్రధానితో పాటు చంద్రబాబు బాధ్యత వహించాలని కన్నబాబు అన్నారు.

రాజమండ్రి : రైతుల డబ్బు బ్యాంకుల్లో ఉన్నా వాళ్లు తీసుకోలేని పరిస్థితి దారుణమని తూర్పు గోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ జిల్లావ‍్యాప్తంగా రూ.627 కోట్ల ధాన్యం అమ్మకాల సొమ్మును రైతులు జమ చేశారన్నారు.

కానీ రైతులు రైతులు ఒక్క రూపాయి కూడా తీసుకోలేని పరిస్థితి తలెత్తిందన్నారు.  మరో 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, దాని పరిస్థితి ఏంటని కన్నబాబు ప్రశ్నించారు. పింఛన్లు నగదు రూపంలో ఇవ్వాలని, నగదు కష్టాలకు ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement