'ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎప్పుడు చెప్పలేదు' | Kanna lakshminarayana takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎప్పుడు చెప్పలేదు'

May 26 2015 12:00 PM | Updated on Mar 29 2019 9:07 PM

'ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎప్పుడు చెప్పలేదు' - Sakshi

'ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎప్పుడు చెప్పలేదు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం రాజమండ్రిలో నిప్పులు చెరిగారు.

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం రాజమండ్రిలో నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు... డిమాండ్లు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బాబు గతంలో చేసిన హామీలు, డిమాండ్లు అమలు చేశారా? అని బాబును కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.  ఈ అంశంపై చంద్రబాబును ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నించారా ? అని అడిగారు.


మీడియాకు సీఎం చంద్రబాబు అంటే ఎందుకంత ప్రేమ, తమ పార్టీ అంటే ఎందుకంత కక్ష అని ఆయన విలేకర్లను ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని కన్నా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అని కన్నా పేర్కొన్నారు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదాకు చోటు కల్పించలేదని వెల్లడించారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీని దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారని చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement