కాకతీయ శకటానికి నోచాన్స్ | Kakatiya carriages nocans | Sakshi
Sakshi News home page

కాకతీయ శకటానికి నోచాన్స్

Jan 27 2014 3:22 AM | Updated on Sep 2 2017 3:02 AM

కాకతీయుల చరిత్రను చాటిచెప్పే సువర్ణావకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని...

వరంగల్, న్యూస్‌లైన్ : కాకతీయుల చరిత్రను చాటిచెప్పే సువర్ణావకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే పరేడ్‌లో కాకతీయ శకట  ప్రదర్శనకు అవకాశం రాలేదు. అసలు రాష్ట్రం నుంచే ఏ శకట ప్రదర్శనకు నోచుకోకపోవడం గమనార్హం. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ‘కాకతీయ శకటాన్ని’ ప్రదర్శించాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు చాలా రోజుల క్రితమే పంపించారు.

ఇందుకు రక్షణ శాఖ చివరి నిమిషంలో నో చెప్పిం ది. ఈ చర్య ఓరుగల్లు వాసులను తీవ్రంగా నిరాశ పరిచింది. రాష్ట్రానికి 2009 నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌లో శకటాన్ని ప్రదర్శించేందుకు అవకాశం లభించక పోవడం గమనార్హం. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement