జై జగన్.. | jai jagan | Sakshi
Sakshi News home page

జై జగన్..

Sep 24 2013 3:44 AM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జిల్లావ్యాప్తంగా సంబరాలు పెద్ద ఎత్తున సాగాయి


 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్
 వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జిల్లావ్యాప్తంగా సంబరాలు పెద్ద ఎత్తున సాగాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. యువనేతకు బెరుుల్ రావడం ప్రజావిజయమని పేర్కొంటూ డోర్నకల్ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. నున్నా రమణ, ఉన్నం సత్యం, పోటు జనార్ధన్, పోకల శేఖర్ పాల్గొన్నారు. కురవిలో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. మహబూబాద్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్వీట్లు పంపిణీ చేసి...  టపాసులు కాల్చుతూ.. బ్యాండ్ మేళా మధ్య సంతోషాన్ని పంచుకున్నారు. వైఎస్సార్ విగ్రహం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు. జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, కర్నావత్ రాధావెంకన్న నాయక్, బోళ్ల రాకేష్‌రెడ్డి, రాములు నాయక్, గురుమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి, గూడూరులో రవీందర్‌యాదవ్, సర్ధార్ తదితరులు పాల్గొన్నారు.
 
  కేసముద్రంలో సంకెపల్లి శ్రీనివాసరెడ్డి, బషీర్, లాలూ నాయక్  మిఠాయిలు పంపిణీ చేశారు. హన్మకొండ బాలసముద్రంలో వైఎస్సార్ సీపీ యూత్ నేతల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. హన్మకొండ చర్చి, జులైవాడ, ఎస్‌డీఎల్‌సీఈ సెంటర్‌లో బాణసంచా కాల్చి, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. యూత్ జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి, జిల్లా నాయకులు కల్యాణ్‌రాజ్, సాల్మన్‌రాజు, యెడ్ల రఘువీర్‌రెడ్డి, దయాకర్, ఆశం కళ్యాణ్, గుండ్ల రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ మండిబజార్‌లో పార్టీ నాయకుడు సయ్యద్ మసూద్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో విద్యార్థి సంఘం, వైఎస్సార్‌సీపీ నాయకులు టపాసులు కాల్చడంతోపాటు స్వీట్లు పంపిణీ చేశారు. పట్టణ నాయకుడు చెప్పాల అగస్తీన్ తుమ్మ భాస్కర్, కరుణాకర్, గుగ్గిల్ల శ్రీధర్ పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రం, ఇప్పగూడెం, పల్లగుట్ట గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు దైద కిష్టఫర్, కందికొండ బిక్షపతి, అకినపెల్లి రవీందర్, యేసుబాబు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ములుగులో పార్టీ నాయకుడు మావూరపు సమ్మిరెడి ఆధ్వర్యంలో, మంగపేటలో పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. గోనె తిరుపతి, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.
 
 నర్సంపేట పట్టణంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు నాడెం శాంతికుమార్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు బిల్ల ఇంద్రారెడ్డి, బండి రమేష్ పాల్గొనగా...  చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ములుగు ఘనపురం, మొగుళ్లపల్లి మండలాల్లో పార్టీ నాయకులు కొత్తూరు విజయేందర్‌రెడ్డి, కుంచాల సుబ్బారావు, మోటపోతుల చందర్‌గౌడ్, తడక శ్రీధర్, బాలకృష్ణ తదితరులు బాణసంచా కాల్చి, సంబరాలు జరుపుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement