అక్రమాలకు అండగా టీడీపి ఎమ్మెల్యేలు? | Irregularities in the allocation of Autonagar land | Sakshi
Sakshi News home page

అక్రమాలకు అండగా టీడీపి ఎమ్మెల్యేలు?

Nov 3 2014 9:09 PM | Updated on Aug 10 2018 7:19 PM

ఆటోనగర్ భూముల కేటాయింపులో జరిగిన అక్రమాలకు టీడీపి ఎమ్మెల్యేలు అండగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఏలూరు: ఆటోనగర్ భూముల కేటాయింపులో జరిగిన అక్రమాలకు టీడీపి ఎమ్మెల్యేలు అండగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా ఇక్కడ ప్లాట్లు  కేటాయించారు. తాము డబ్బు చెల్లించినా ప్లాట్లు కేటాయించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆటోనగర్ అక్రమాలపై పోలీసులు స్పందించారు. అధ్యక్షుడు మాగంటి నాగభూషణం ఇంట్లో సోదాలు మొదలు పెట్టారు.

నాగభూషణంపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో 420, 406, 468, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టీడీపి ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, చింతమనేని ప్రభాకర్లు నాగభూషణం ఇంటికి చేరుకున్నారు.  ఈ కేసు విషయంలో  టీడీపి ఎమ్మెల్యేలు డీఐజీపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement