పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను న డుపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు.
హైదరాబాద్ : పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను న డుపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. శబరిమలై, రామేశ్వరం,వారణాసి,ఢిల్లీ-ఆగ్రా-జైపూర్-మధుర,గయ-ప్రయాగ,తదితర ప్రాంతాలకు వెళ్లే యాత్రికుల కోసం భోజన,వసతి,రోడ్డు రవాణా సదుపాయాలతో ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను రూపొందించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు హైటెక్స్‌లో జరుగనున్న ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ ప్రదర్శనలో ప్రయాణాలు బుక్ చేసుకున్న వారికి 5 శాతం రాయి తీ కూడా లభిస్తుందన్నారు. సికింద్రాబాద్-రామేశ్వరం ప్యాకేజ్డ్ టూర్ ఆగస్టు 13, 20, సెప్టెంబర్ 17 తేదీలలో ప్రారంభమవుతుంది. మొత్తం 5 రాత్రులు,6 పగళ్లు ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.7,581 చొప్పున చార్జీ ఉంటుంది. సికింద్రాబాద్-వారాణాసి టూర్ ఆగస్టు 8, 15 తేదీలలో ప్రారంభమవుతుంది.మొత్తం 5 రాత్రులు,6 పగళ్లు ఉంటుంది. రూ.7,381 చొప్పున చార్జీ తీసుకుంటారు. సికింద్రాబాద్-శబరిమలై యాత్ర నవంబర్ 15, వచ్చే సంవత్సరం జనవరి 20 తేదీలలో ప్రారంభమవుతుంది.
ఈ టూర్‌లో రూ.4,178 చొప్పున చార్జీ తీసుకుంటా రు. 4 రాత్రులు,5 పగళ్లు ఈ టూర్ కొనసాగుతుంది. అలాగే విజయవాడ-శబరిమలై టూర్ నవంబర్ 15, వచ్చే ఏడాది జనవరి 10 తేదీలలో ప్రారంభమవుతుంది. ఉత్తరాది యాత్రలలో భాగం గా సికింద్రాబాద్-గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ సెప్టెంబర్ 5న ప్రారంభమవుతుంది. మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. రూ.15,507 చొప్పున చార్జీ తీసుకుంటారు. ఈ ప్రత్యేక ప్యాకే జీల కోసం ప్రయాణికులు ఫోన్ 9701360701 నంబర్‌కు సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఆర్‌ఆర్‌బి అభ్యర్థులకు ప్రత్యేక రైలు
ఆర్‌ఆర్‌బీ పరీక్ష నేపథ్యంలో సంత్రాగచ్చి-సికింద్రాబాద్ (08045) స్పెషల్ ట్రైన్ నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది ఏపీలో విశాఖపట్టణం,రాజమండ్రి,విజయవాడ, తెలంగాణలో వరంగల్ స్టేషన్‌లలో ఆగుతుంది.