ప్రశాంతంగా పోస్టల్ పరీక్ష | Indian Postal exam is success | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పోస్టల్ పరీక్ష

Apr 12 2015 6:07 PM | Updated on Sep 18 2018 8:18 PM

భారత తపాలాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్‌మెన్ ఖాళీల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

సాక్షి, విజయవాడ : భారత తపాలాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్‌మెన్ ఖాళీల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇందుకోసం విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, నంద్యాల, హైదరాబాద్‌ల్లో 130 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 75 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

మొత్తం 1.50 లక్షల మందికి గాను 1.10 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయ  ఉన్నతాధికారులు తెలిపారు. గుంటూరు డివిజన్‌లో ఖాళీగా ఉన్న 14 పోస్టులకు గాను 14 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే పోస్టుకు వెయ్యి మంది పరీక్ష రాశారన్నమాట. అదేవిధంగా ఖమ్మం డివిజన్‌లో 4 పోస్టులు ఖాళీ ఉంటే ఇక్కడా వెయ్యిమందికి పైగా పరీక్ష రాశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement