బాటిల్‌ మహల్‌ | Sakshi
Sakshi News home page

బాటిల్‌ మహల్‌

Published Thu, Aug 29 2019 11:39 AM

Hut with Water Bottles In Kothapatnam Beach Prakasam - Sakshi

సాక్షి, ఒంగోలు:  ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్య కారకాల్లో ప్లాస్టిక్‌ ఒకటి.. భూతాపాన్ని మరింతగా పెంచుతున్న ఈభూతం.. మానవ మనుగడకే మంట పెడుతోంది. ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ ప్రక్రియకు పునాదులు పడినా.. ఆచరణ అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలని ప్రజలకు అవగాహన కల్పించేలా కొత్తపట్నం బీచ్‌లోని ఓ రిసార్ట్‌ నిర్వాహకులు భావించారు. వినూత్న రీతిలో ప్లాస్టిక్‌ బాటిల్‌ హౌస్‌ నిర్మించారు. కొత్తపట్నం బీచ్‌కు వచ్చే పర్యాటకులు తాగి పడేసిన 6,500 ఖాళీ సీసాలను ఇందుకువినియోగించారు. బాటిల్‌ మూతలను ఇంటి లోపలి భాగం గచ్చుపై వృత్తాకారంలో ఆకర్షణీయంగా పేర్చారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచిస్తూ చేపట్టిన ఈ నిర్మాణం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది చదవండి : కొండా.. కోనల్లో.. లోయల్లో..

1/1

Advertisement
Advertisement