కట్టుకున్నవాడే కాలయముడై..

Husband Killed Wife In West Godavari - Sakshi

భార్యను కత్తిపీటతో నరికి చంపిన భర్త

అనుమానంతోనే ఘాతుకం

పశ్చిమగోదావరి ,నిడమర్రు: జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్తే ఉన్మాదిగా మారి భార్యను హతమార్చిన ఘటన నిడమర్రు మండలం గుణపర్రు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ద్వారకాతిరుమల మండలం  పి.కన్నాపురం గ్రామానికి చెందిన గుడిసే పాపయ్య, నాగమణి (30) దంపతులు కుమార్తె రమ్యతో కలిసి ఇటీవల గుణపర్రులో కోటగిరి సత్యనారాయణ రొయ్యల చెరువు వద్దకు కాపలాదారు కుటుంబంగా వచ్చారు. వీరి కుటుంబం చెరువు వద్ద షెడ్డులో ఉంటున్నారు.

బుధవారం రాత్రి భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. పాపయ్య విచక్షణ మరిచి నాగమణిని కత్తిపీటతో నరికేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి కుమార్తె రమ్యను ఆదేగ్రామంలోని బంధువుల ఇంటి వద్ద విడిచి పరారయ్యాడు. రొయ్యల చెరువుపై ఉన్న ఏరియేటర్లు తిరుగుతూ ఉండటం గమనించిన యజమాని ఆరా తీయగా పాపయ్య బంధువులు వచ్చి షెడ్డు తాళాలు పగులకొట్టారు. నాగమణి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. కన్నాపురంలో ఉంటున్న మృతురాలు తల్లి నంద్యాల కృష్ణకుమారికి సమాచారం అందించడంతో వచ్చి తన అల్లుడే హత్య చేశాడని నిడమర్రు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మొదటి నుంచి పాపయ్యకు తన కుమార్తెపై అనుమానం ఉందని, ఇటీవల పెద్దల సమక్షంలో సర్దుబాటు చేసి పంపామని చెప్పారు. పాపయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా కోరుకొల్లు మండలం కలిదిండి గ్రా మం కాగా నాగమణితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి వీరభద్రం (17), రమ్య (7) బిడ్డలు. కుమారుడు వీరభద్రం కన్నాపురంలో అమ్మ మ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నాడు. మహిళా డీఎస్పీ పైడేశ్వరరావు, అదనపు డీఎస్పీ కె.ఈశ్వరరావు, గణపవరం సీఐ జి.శ్రీనివాస్‌యాదవ్, ఎ స్సై ఎం.వీరబాబు క్లూస్‌ టీమ్‌తో వచ్చి ఘటనా స్థలంలో విచారణ చేశారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top