తుని మండలం కొలిమేరులో నిద్రిస్తున్న భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో
తుని రూరల్ : తుని మండలం కొలిమేరులో నిద్రిస్తున్న భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన శివకోటి ఆనంద్ తన భార్య మరియ గొంతుపై బ్లేడ్‌తో కోసి హత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన మరియను ఆమె సోదరుడు చక్కా అప్పారావు 108 అంబులెన్సులో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలవరం గ్రామానికి చెందిన ఆనంద్‌తో మరియకు వివాహమైందని, వారి మధ్య మనస్పర్థల తలెత్తడంతో రెండేళ్లగా వేర్వేరుగా ఉంటున్నారని అప్పారావు తెలిపాడు. ఇటీవల ఆనంద్ వచ్చి గ్రామపెద్దలతో చర్చించడంతో ఇద్దరూ కలసి కొలిమేరులోనే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నిద్రిస్తున్న మరియపై హత్యాయత్నం చేశాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్సై ఎం.అశోక్ తెలిపారు.