శంషాబాద్ మండలంలోని రబ్బర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయ్యారు.
హైదరాబాద్ : శంషాబాద్ మండలం గగన్‌పహడ్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అక్షిత రబ్బర్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు. మృతులను సందీప్ కుమార్, నవీన్, గోవింద్ చౌదరి, కిషన్గా గుర్తించారు. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.
పెద్దఎత్తున ఆస్తినష్టం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా మృతుల కుటుంబాలకు 15 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.