హౌరా-చెన్నై ప్రీమియం రైలు రద్దు | Howrah - Chennai Premium train canceled | Sakshi
Sakshi News home page

హౌరా-చెన్నై ప్రీమియం రైలు రద్దు

Apr 29 2014 1:01 AM | Updated on Sep 2 2017 6:39 AM

హౌరా-చెన్నై మధ్య దువ్వాడ మీదుగా తరలిపోయే 02841/42 నంబరు గ ల ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు.

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : హౌరా-చెన్నై మధ్య దువ్వాడ మీదుగా తరలిపోయే 02841/42 నంబరు గ ల ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. హౌరా నుంచి  మే 9 నుంచి జూన్ 27 తేదీల మధ్య ప్రతి శుక్రవారం బయల్దేరే ఈ రైలును సదరన్ రైల్వే రద్దు చేసింది. ఈ రైలుకు ఊహించినట్టుగా ఆదరణ లేకపోవడంతో పాటు, పలు సమస్యలు రావడంతో రైలును రద్దు చేశారు.  చెన్నై నుంచి మే 10 నుంచి జూన్ 28 తేదీ మధ్య ప్రయాణించాల్సిన రైలునూ రద్దు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement