భక్తులపై తేనెటీగల దాడి | Honey bee attack | Sakshi
Sakshi News home page

భక్తులపై తేనెటీగల దాడి

Apr 27 2015 5:33 PM | Updated on Sep 3 2017 12:59 AM

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కొలను భరతి క్షేత్రంలో కొలువుదీరిన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులపై సోమవారం తేనెటీగలు దాడి చేశాయి.

కర్నూలు : కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కొలను భరతి క్షేత్రంలో కొలువుదీరిన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులపై సోమవారం తేనెటీగలు దాడి చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. భక్తులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భోజన ఏర్పాట్ల కోసం అక్కడే మంటపెడుతున్న సమయంలో పొగ తేనెతుట్టకు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

దీంతో ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేయడంతో భక్తులు తలోదిక్కు పరుగులు తీశారు. మొత్తం పదిహేను మంది దర్శనానికి వెళ్తే.. వారిలో గాయపడిన ఏడుగురు వ్యక్తులు ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మిగతా వారికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement