హోంగార్డ్స్‌ వేతనం పెంపు

Homeguards Daily Wages Hikes In PSR Nellore - Sakshi

దినసరి వేతనం రూ.600కు పెంచుతూ జీఓ జారీ

మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు పెంపు  

నెల్లూరు : రెండేళ్ల సుదీర్ఘ ఎదురుచూపులు ఫలించాయి. హోంగార్డ్స్‌ దినసరి వేతనా న్ని రూ.400 నుంచి రూ.600కు పెంచుతూ రా ష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్‌ 77ను సోమవారం రాత్రి విడుదల చేసింది. పెంచిన వేతనాలు జూలై ఒకటినుంచి అమలులోకి రానున్నాయి.

జిల్లాలో 841 మంది హోంగార్డులుండగా  వీరిలో సాధారణ విధుల్లో 590 మంది, డిప్యూటేషన్‌ విధుల్లో 296 మంది ఉన్నారు. వీరికి 2016 మార్చి 29వ తేదీన దినసరి వేతనం రూ.400కు పెంచుతూ ప్రభుత్వం జీఓ నంబర్‌ 37ను జారీచేసింది. అయితే పెరిగిన అవసరాలకు అనుగుణంగా తమ వేతనాన్ని పెంచాని హోంగార్డ్స్‌ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ హోంగార్డ్స్‌ దినసరి వేతనాన్ని ఇప్పటికే రెండు పర్యాయాలు పెంచుతూ జీఓలు జారీచేసింది. దీంతో మన రాష్ట్రంలోనూ వేతనాలను పెంచాలని హోంగార్డ్స్‌ ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు.

ఈ నేపథ్యంలో జీఓ జారీ అయింది. మహిళా హోంగార్డ్స్‌కు ప్రసూతి సెలవులు మూడునెలలు పెంపు, నెలకు రెండురోజుల సెలవులు, అకాల మరణం చెందితే అంత్యక్రియల ఖర్చులు రూ.1,000 నుంచి రూ.10 వేలకు పెంపు, ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు వైద్యసాయం, విధి నిర్వహణలో (ప్రమాదవశాత్తు, సాధారణ) మృతిచెందితే రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా), ప్రభుత్వ గృహనిర్మాణ పథకంలో లబ్ధికల్పిస్తున్నట్లు జీఓలో పేర్కొన్నారు. హోంగార్డ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా నాయకులు మస్తాన్, ఎం.ప్రసాద్, కాయల్‌ భాస్కర్‌లు హర్షం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top