తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రులు ఆమోదం తెలపడంపై అనంతపురంలోని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులుకక్కారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రులు ఆమోదం తెలపడంపై అనంతపురంలోని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులుకక్కారు. కేంద్రప్రభుత్వ వైఖరిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో విద్యార్థులు తీవ్రం వ్యతిరేకించారు. కేంద్రంప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీలో విద్యార్థులు శుక్రవారం భారీ సమైక్య ర్యాలీ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో సమైక్య ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దాంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా యూనివర్శిటీ వద్ద భారీగా పోలీసు బలగాలను ఉన్నతాధికారులు మోహరించారు.