వైఎస్సార్ అవార్డుల ఎంపికకు కమిటీ

High Power Committee For Selection Of YSR Lifetime Achievement Awards - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత మహానేత వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ప్రజా సేవా కార్యక్రమాలు చేసేవారికి అవార్డుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులుగా సలహాదారులు దేవుపల్లి అమర్‌, కె.రామచంద్రమూర్తి, జీవీడీ కృష్ణమోహన్‌, ఐఏఎస్‌ అధికారులు ప్రవీణ్‌ ప్రకాష్‌, కె.దమయంతి, ఉషారాణి, కోన శశిధర్‌, జేవీ మురళి, ఐఐఎస్‌ అధికారి టి.విజయకుమార్‌ రెడ్డి నియమితులయ్యారు. ప్రతి ఏడాది ఆగస్టు 15, జనవరి 26వ తేదీన వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top