జీవో నంబర్‌ 14పై హైకోర్టులో కేసు | high court asks ap govt to counter over GO14 | Sakshi
Sakshi News home page

జీవో నంబర్‌ 14పై హైకోర్టులో కేసు

Mar 8 2017 1:37 PM | Updated on May 28 2018 3:33 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్‌ 14పై హైకోర్టులో కేసు నమోదు అయింది.

అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్‌ 14పై హైకోర్టులో కేసు నమోదు అయింది. జీవో నెంబర్ 14ను నిలిపివేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

మున్సిపాలిటీలోని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్‌ 14ను జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement