మహా మాయలాడి | he purchase of the assets at the expense of the billet | Sakshi
Sakshi News home page

మహా మాయలాడి

Jan 25 2015 2:43 AM | Updated on Apr 6 2019 8:52 PM

మహా మాయలాడి - Sakshi

మహా మాయలాడి

చీటీల పేరిట రూ. 1.2 కోట్లు వసూలు చేసిన చంద్రగిరి కొత్తపేట భారతీనగర్‌కు చెందిన ఎం. సత్యనారాయణ శెట్టి భార్య వనజ ....

వనజ ఐపీ దాఖలుతో లబోదిబోమంటున్న బాధితులు
చీటిల సొమ్ముతో ఆస్తుల  కొనుగోలు : బాధితుల ఆరోపణ

 
 చంద్రగిరి : చీటీల పేరిట రూ. 1.2 కోట్లు వసూలు చేసిన చంద్రగిరి కొత్తపేట భారతీనగర్‌కు చెందిన  ఎం. సత్యనారాయణ శెట్టి భార్య వనజ పలువురికి టోపీ పెట్టిం ది. శుక్రవారం ఆమె ఐపీ దాఖలు చేసిన నేపథ్యంలో ఒక్కో మాయ వెలుగు చూ స్తోంది. 30 ఏళ్ల క్రితం  పలమనేరు   ప్రాం తం నుంచి సత్యనారాయణశెట్టి, వనజ చంద్రగిరికి వలస వచ్చారు.  బతుకు తెరువుకోసం పరిసర గ్రామాల్లో బొగ్గు సేకరిం చి విక్రయించేవారు. వనజ భర్త  ఓ ప్రైవేటు బస్సులో  క్లీనర్‌గా చేరాడు. అనంతరం డ్రయివింగ్  నేర్చుకుని ఆర్టీసీలో కాం ట్రాక్టు పద్ధతిపై చేరిన ఆయన సర్వీసు రెగ్యులర్ అయింది. భర్త  ప్రోత్సాహంతో వనజ చీటీల వ్యాపారం ప్రారంభించింది. డాక్టర్‌తో మంచిగా ఉండడంతో ఆమె ప్రభుత్వాస్పత్రిలో  కాంట్రాక్ట్ పద్ధతిన  స్వీపర్‌గా చేరింది. 

పలుకుబడి తీవ్రంగా పెంచుకుంది.  దీంతో స్థానికులు ఆమెపై  నమ్మకంతో  అధికంగా చీటీలు వేశారు. ఆమె తండలు, వడ్డీవ్యాపారం నిర్వహించేది. ఊహించని విధంగా వనజ శుక్రవారం  తిరుపతి కోర్టులో కోటి 56 లక్షల 80వేల రూపాయలకు  ఐపీ దాఖలు చేయడంతో  బాధితులందరూ  లబోదిబోమంటున్నారు. వనజ ఓ ప్రముఖ  నాయకుడి కుమారుడు పేరుతో ఈ ఏడాది జనవరి13న 2.79 ఎకరాల భూమి విక్రయించినట్లు  బాధితులు రికార్డులు  చూపిస్తున్నారు. ఆమె కుమారుడు బినామీగా 2014 డిసెంబర్ ఒకటో తేదీ సదుం ప్రాం తంలో  2కోట్ల 23లక్షల  రూపాయల విలువైన భూమి కొనుగోలుకు ఆమె అగ్రిమెంట్  చేయించుకుందని ఆరోపిస్తున్నారు.  బాధితుల ఫిర్యాదు మేరకు చంద్రగిరి సీఐ శివప్రసాద్  వనజ ఆమె భర్త  సత్యనారాయణశెట్టి, కుమారుడు  బాలాజీ, కోడలిపై  ఎఫ్‌ఐఆర్  నమోదు  చేశామని తెలిపారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement