పశ్చిమ గోదావరి జిల్లాలో కిడ్నాప్కు గురైన ఓ వ్యాపారి కుమారుడి జీవితం విషాదాంతమైంది.
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాలో కిడ్నాప్కు గురైన ఓ వ్యాపారి కుమారుడి జీవితం విషాదాంతమైంది. కొయ్యలగూడెం మండలం కన్నాపురానికి చెందిన హరినాథ్ను దుండగులు కిడ్నాప్ చేసి భారీ మొత్తం డిమాండ్ చేశారు.
బాధితుడి కుటుంబం నుంచి 10 లక్షల రూపాయిలు తీసుకున్నారు. అయితే దుండగులు డబ్బులు తీసుకున్నా హరినాథ్ను ప్రాణాలతో విడిచిపెట్టలేదు. అతణ్ని అమానుషంగా చంపేశారు. ఖమ్మం జిల్లా దమ్మపేట అటవీ ప్రాంతంలో హరినాథ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్య వెనుక పలు కారణాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.