మృత్యుశకటమైన కారు | Hanumanjanksanlo truck collision, which atonu .. | Sakshi
Sakshi News home page

మృత్యుశకటమైన కారు

Oct 19 2013 1:06 AM | Updated on Aug 30 2018 3:56 PM

పట్టణంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రంగా, మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి.

 

=హనుమాన్‌జంక్షన్‌లో ట్రక్ ఆటోను ఢీకొన్న వైనం..
=ఒకరి మృతి.. నలుగురికి గాయాలు
=మూడు దూడలు గాయాలపాలు..

 
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : పట్టణంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రంగా, మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సం బంధించి వివరాలిలా ఉన్నాయి. కంకిపాడు మం డలం పునాదిపాడుకు చెందిన ముసుబోయిన రామకృష్ణ(50) తన దూడలు మూడింటిని ట్రక్ ఆటోలో ఎక్కించి, జంక్షన్‌లోని పశువుల సంతకు బయలుదేరాడు. స్థానిక విజయవాడ రోడ్డులోని టాటా కంపెనీ సమీపంలో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి ట్రక్ ఆటోను ఢీకొట్టింది. దీంతో అది మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణ అక్కడికక్కడే మరణించాడు. పోరంకికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ పకీర్ అహ్మద్, క్యాబిన్‌లో ఉన్న మరో ప్రయాణికుడు సుబ్బారావు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ట్రక్ ఆటోలోని మూడు దూడలు తీవ్రంగా గాయపడ్డాయి. కారు నడుపుతున్న వెంకట రమణ, అందులో ఉన్న మహిళ స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

హనుమాన్‌జంక్షన్ సీఐ వై.వి.రమణ, ఎస్సై బి.ప్రభాకరరావు సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకట రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రక్తపు మడుగులో పడి ఉన్న రామకృష్ణ మృతదేహాన్ని, గాయపడిన దూడలను చూసి స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement