‘ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు’

Gopala Krishna Dwivedi Press Meet Over Cyclone Fani - Sakshi

సాక్షి, అమరావతి: ఫొని తుపాన్‌ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ వెసులుబాటు కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా సీఈసీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కోడ్‌ వెసులుబాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం సీఈసీకే ఉంటుందని పేర్కొన్నారు.

సీఈసీ ఇచ్చే ఆదేశాలను తాము అమలు చేస్తామని అన్నారు. తుపాన్‌ వల్ల స్ట్రాంగ్‌ రూమ్‌ల్లోని ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని వెల్లడించారు. తుపాన్‌ ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండమని కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top