
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో మరో ఐదు మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు 33 మృతదేహాలను బృందాలు వెలికితీశాయి. మరో 13 మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ మేరకు గోదావరిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గోదావరిలో దాదాపు 300 అడుగుల లోతులో ఉన్న లాంచీని వెలికి తీసేందుకు ఎన్టీఆర్‌ఎఫ్, నేవీ, అగ్నిమాపక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇందుకోసం ఉత్తరాఖండ్‌కు చెందిన సైడ్ స్కాన్ సోనర్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)