ప్రమాదవశాత్తు బాలికకు నిప్పంటుకొని తీవ్రంగా గాయాలపాలైంది.
విజయనగరం: ప్రమాదవశాత్తు బాలికకు నిప్పంటుకొని తీవ్రంగా గాయాలపాలైంది. ఈ సంఘటన విజయనగరం జిల్లా మక్కువ మండలం కప్పబుచ్చంపేట గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. కప్పబుచ్చంపేట గ్రామానికి చెందిన రాయల శృతి(13) కాశీపట్నంలోని కస్తూర్బా పాఠశాలలో 8వతరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు వచ్చిన బాలిక ఇంటివద్దనే ఉంది. ఈ క్రమంలో సోమవారం వంట చేసేందుకు ప్రయత్నిస్తుండగా చున్నీకి నిప్పు అంటుకొని మంటలు వ్యాపించడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే బాలిక ను బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైజాగ్‌లోని కేజీహెచ్ కు తీసుకువెళ్లాల్సిందిగా వైద్యులు సిఫారసు చేశారు.
(మక్కువ)