
చంద్రబాబుకు పిచ్చి ముదిరింది: గట్టు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద సైకో అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు.
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద సైకో అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. ఇక ఎన్నటికీ అధికారం దక్కదనే నిరాశా నిస్పృహలతోనే చంద్రబాబు పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, అందుకు ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శనమని చెప్పారు.
బాబుకు బాగా పిచ్చి ముదరడంవల్లే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ తమ అధినేత జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించడంలేదనే అక్కసుతో ప్రజలపై కోపం పెంచుకొని తెలుగుజాతిని నిట్టనిలువునా చీల్చేందుకు సహాయపడ్డారని మండిపడ్డారు.