
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ కడప: మాజీ ఎమ్మెల్యే పాలకొలను నారాయణరెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఆయన 1962లో మైదూకూరు నియోజకవర్గంలో స్వతంత్ర పార్టీ తరుపున ఎమ్మెల్యే గెలిచారు. ఆయన మృతికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణారావు, రాష్ట్ర మాజీ మహిళా అర్థిక ఛైర్ పర్సన్ క్రిష్ణమ్మ సంతాపం తెలిపారు.