
61 రోజుల పాటు వేట నిషేధం
సముద్రంలో వేట నిషేధం నేటి నుంచి అమలులోకి వచ్చింది.
కాకినాడ: సముద్రంలో వేట నిషేధం నేటి( గురువారం) నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిషేధం జూన్ 14 వరకు కొనసాగనుంది. ఏకంగా ఈసారి 61 రోజుల పాటు వేట నిలిపివేయడం ఇదే మొదటిసారి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న మత్స్య కారుల కన్జర్వేషన్ పీరియడ్‌గా నిర్ధారించిన సంగతి తెలిసిందే.
ఈ పీరియడ్‌లో చేపలు గుడ్లు పెట్టే కాలంగా పరిగణిస్తారు. ఇలాంటి సమయాల్లో వేట చేయడం వల్ల ఆశించిన మేరకు మత్స్యవేట సాగకపోగా, చేపల సంతతి అంతరిం చుపోతుందనే ఉద్ధేశ్యంతో ప్రతి సంవత్సరం సముద్రంలో వేట చేయకూడదనే నిబంధనను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నిబంధనలకు విర్ధుంగా మత్స్యకారులు వేట సాగిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.